నీతి అంతిమంగా నిలుస్తుందా?

ఇప్పుడంటే మొదలైనప్పట్నుంచీ పూర్తై హాలు బైటికి వచ్చేదాకా హోరెత్తించే ‘సౌండు’ కానీ..చలనచిత్రాల మొదటి దశ మూగది. తెరమీద బొమ్మలాడుతుంటే అనువాదకుడు హాలు మూల నిలబడి పెద్ద గొంతేసుకుని తనకు తోచిన వ్యాఖ్యానం చేస్తుండేవాడు. అప్పట్లో వచ్చినవన్నీ ముంబై..కలకత్తా మార్కు హిందీ.. బెంగాలీ ‘మేకు’లు కనక ఈ అనువాదకుడి సాయం మన ప్రేక్షకులకు అవసరమయేది.అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది.సంఘటన పాతదే ఐనా..అందులోని హాస్యం మాత్రం సదా తాజాదే.చిత్తగించండి చిత్తమున్నవారు.
ఒక హిందీ సినిమా మొదటి రోజు మొదటి ఆట మ్యాట్నీ మొదలైంది ఒక తెలుగు వూళ్ళో.బాక్సు చివరి నిముషంలో రావడం వల్ల హాలు వాళ్ళకు వేసుకుని చూసుకునే సావకాశం లేక పోయింది.వచ్చిన రీళ్ళను ఆదరాబాదరాగా ప్రోజెక్టరు రోలర్ల్లకు చుట్టేసి సినిమా మొదలు పెట్టేసారు. కథ నడుస్తోంది.అనువాదకుడు భీభత్సంగా అనువాదం చేసి పారేస్తున్నాడు తనకు తోచిన పదజాలంతో.చివరికి అన్ని చిత్రాలలో లాగేనే కథానాయికను నానాతిప్పలు పెట్టిన ప్రతినాయకుడు ముష్టియుద్దంలో కథానాయకుడి చేత చితకబాదించుకుని..ఎలాగైతేనేం..చచ్చాడు చివరికి. అనువాదకుడు వ్యాఖ్యానంతో రెచ్చి పోతూ స్వస్తి వాక్యాల్లో ఇలాగా నీతి బోధ మొదలుపెట్టాడు”అంతిమ విజం న్యాయానికి, నీతికే లభిస్తుందని మరో సారి రుజువైంది. ఎంత కాలం దుష్టుల ఆటలు చెల్లుతాయి? ఈ చిత్రంలో అదే నీతి” అంటూ. జనం లేచేశారు ఈలలేసుకుంటో సినిమా ఐపోయిందని. కానీ..చచ్చిన ప్రతినాయకుడు..ఎలా బ్రతికి వచ్చాడో..మద్యం తాగుతూ..వికటాట్టహాసాలతో కథానాయికను తెగ చెర బట్టేస్తున్నాడు! తెల్ల బోవడం ప్రెక్షకుల వంతయింది. చితకబాదుదామనుకుంటే అనువాదకుడేడి? ప్రాజెక్టు రూంలోకెళ్ళి నక్కి కుర్చున్నాడు.
(రీళ్లుచుట్టే హడావుడిలో ఎలా జరిగిందో ఏమో కానీ..చివరి భాగం ముందుకి ..ముందు భాగం చివరికి తారుమారయాయి..అదండీ సంగతి! )
Advertisements

పుస్తక ప్రపంచం ఏప్రిల్ 23. ‘ప్రపంచ పుస్తక దినం’ (ఈనాడు ఆదివారం-సంపాదకీయం)

 

 పుస్తకప్రపంచం

ఏప్రిల్23.  ప్రపంచపుస్తకదినం‘ (ఈనాడు ఆదివారంసంపాదకీయం)

మనిషికితెలిసిందిచాలాస్వల్పం. తెలుసుకోవాల్సిందిఅధికం. మనువుమాటప్రకారం, తెలియనివాటినితెలియజెప్పేవిశ్రుతి, స్మృతి, సిద్ధులదివ్యదృష్టి, సజ్జనులసాంగత్యం. గురువ్యవస్థ, పర్యటన, పరిశీలన, స్వయంచేతనవాటినిసాధించేమార్గాలు. గురువులుఅందరికీదొరకరు. దేశాటనా, పరిశోధనాఅందరికీఅందుబాటులోఉండేవికావు. తలబోడిఅయినపిదపకానిదొరకనిదువ్వెనఅనుభవం. మిగిలిందిస్వయంకృషి. దానికినెలవైనవేపుస్తకాలు.

తల్లిసుద్దులుచెబుతుంది. తండ్రిమార్గంచూపిస్తాడు. గురువుఇంగితంబోధిస్తాడు. ఏకకాలంలోమూడుధర్మాలనుస్నేహనిష్ఠతోనిర్వర్తించేదిమాత్రంలోకంలోపుస్తకాలుఒక్కటేఅనేవారుడాక్టర్సర్వేపల్లిరాధాకృష్ణన్. నిజంపుస్తకాలనేస్తుడికిఒంటరితనంఅంటుసోకదు. ‘అక్షరచెలిమినిమించినకలిమిసృష్టిలోమరేదీలేదనిఅక్బర్పాదుషాభావన. స్వయంగాఅక్షరాస్యుడుకాకపోయినావిద్వాంసులతోనిత్యసంపర్కమేపాదుషాలోనిసంస్కారానికిసుగంధాలుఅద్దింది. ‘వాగ్భూషణంభూషణంఅనికదాధూర్జటికవిపద్యం! ‘రాజుకుస్వదేశంలోనేగుర్తింపైతేవిద్వాంసుడికిసర్వేసర్వత్రాసమ్మానమేఅన్నదీకవిసుభాషితమే. దొంగలభయంఎరగనిసొత్తుపదిమందికీపంచినకొద్దీపెరిగేదేకానితరిగేదికాదు. మనిషికిజంతువుకుమధ్యనేకాదుమనిషికీమనీషికీమధ్యతేడాకూడాచదువే! జ్ఞానాన్నిసుగంధంతోపోల్చినకాళిదాసుపుస్తకాన్నిప్రసూనంఅంటాడు. పూవులాగేపుస్తకమూస్వలాభాపేక్షాలేకుండానలుదిక్కులాపరిమళాలువెదజల్లేసద్గుణంకలిగినది.

 శ్రావ్యంబైరసవంతమైమధురమైసర్వాంగసంపన్నమై/ నవ్యంబైపరిణామరూపగతులన్రంజిల్లుచున్భావముల్/ సువ్యక్తంబొనరించున్జగమునన్శోభిల్లువాక్కుఅన్నగిడుగుసీతాపతిశారదాశతకంపద్యంలోనిప్రత్యక్షరమూపరమసత్యమే. వాగ్భూషణంఅమరిఉండేమధురమంజులమంజూషంపుస్తకం. పుస్తకధారిణిఅయినపలుకుతల్లినిసంభావించుకునేసుదినంప్రపంచపుస్తకదినం‘.

చదువుసంధ్యలసంగతులుసృష్టిప్రారంభంకన్నాముందున్నవే. విధాతమగతావస్థలోఉండగాజలరాసిసోమకాసురరాకాసిచేతిలోజారిపడ్డవేదవాంగ్మయాన్నిమీనావతారుడుఉద్ధరించినకథభాగవతంలోఉంది. వేదవిజ్ఞానంసమస్తంగ్రంథరూపంలోనిక్షిప్తమైఉందనేగాదానిఅర్థం! తొలిదేవుడువినాయకుడువ్యాసులవారిభారతానికితొలిరాయసగాడుకూడా. ‘చేతికిగంటమువస్తే/ కోతికిశివమెత్తినట్లుకొందరుమంత్రుల్/ నీతిఎరుంగకబిగుతురు/ సీతారామాభిరామసింగయరామాఅన్నచమత్కారచాటువేచెబుతుందిరాతప్రాముఖ్యాన్ని. దశరథుడిపాలనలోనిరక్షరాస్యులనేవారుఅసలులేనేలేరనిరామాయణంఉవాచ. బౌద్ధగ్రంథంలోచర్మాలపైరాయడాన్నిగురించినప్రస్తావనఉంది. ‘చీకటిసిరాపూసినఆకాశమనేచర్యంపైనిచంద్రమఅనేసుద్దముక్కతోవిధాతచేస్తున్నగణితంలోచివరికిసర్వంతారారూపాలైనసున్నాలేఫలితాలవుతున్నాయనిసుబంధకవివాసవదత్తలోబహుచక్కనిరాతసామ్యాన్నిచెప్పుకొస్తాడు. తాటాకును, భూర్జపత్రాన్నిజ్ఞానచిహ్నంగాభావించారుమనపూర్వీకులు. జ్ఞానదాతబ్రహ్మహస్తానతాళపత్రగ్రంథాలున్నట్లుచెక్కివున్నబాదామి, బహొళెశిల్పాలుఎన్నోతవ్వకాల్లోబయటపడ్డాయి. బుద్ధుడిజాతకకథలోకర్రపుస్తకాలప్రస్తావనకనిపిస్తుంది. పాటీలనేఒకరకమైనపత్రాలపైరాయడాన్నిశ్రీనాథుడూశృంగారనైషధంలోబహువిశదంగావర్ణిస్తాడు. శాతవాహనులకాలంలోగుణాఢ్యుడనేకవిపండితుడుతనవిశ్వకథాసంపుటిబృహత్కథకుతగినఆదరణకరవైందన్నవేదనతోఅగ్గిపాలుచేసినకథఅందరికీతెలిసిందే. ప్రతిపుస్తకానికీభాగ్యాభాగ్యాలుంటాయనిలాటిన్నానుడి. ‘పుస్తకంబులుగలిగినపూరిగుడిసె/ యందునిరుపేదకాపునైయుందుగాని/ పుస్తకములులేనట్టిభూరిసౌధ/ మందుచక్రవర్తిగనుండనభిలషింపఅన్నవిశ్వాసంప్రస్తుతంతిరిగిక్రమంగాపుంజుకుంటోంది. ఇదిఎంతైనాఆనందించదగ్గసంగతే.

నిప్పుతరవాతమానవుడుఆవిష్కరించినఅత్యంతసమర్థమైనసాంకేతికవింతపుస్తకమే. మార్క్ట్వైన్మహాశయుడుఅన్నట్లుమంచిమిత్రులు, మంచిపుస్తకాలు, మంచినిద్రవీటికిమించినమంచిప్రపంచంమరొకటిఏముంటుంది? పుస్తకమంటేలక్షఅక్షరాలు, కిలోకాయితాలు, చిటికెడుసిరామాత్రమేనా? నవరసతరంగాలనురగలపైతేలియాడేకాగితపుపడవ. అదిజేబులోపట్టేసేపూలతోటకొందరుసౌందర్యారాధకులకు. తెలియనిలోకాలకుఎగరేసుకుపోయేమాయాతివాచీమరికొందరువూహాప్రేమికులకు. తులసిదళమంతపవిత్రంమరికొంతమందిగ్రంథప్రియులకు. కలతలనుతొలగించేది, పాపాలనుపారదోలేది, మాంద్యానికిమందులాపనిచేసేది, దుఃఖాలనుమరిపించేదిపుస్తకమే.

కల్పతరువు, గురువు, పురాతన, ప్రస్తుత, భవిష్యత్కాలసంపద, కరదీపిక, ఆశారేఖాపుస్తకమేఅంటారుమహాత్మాగాంధీ. అదిఅక్షరసత్యం. సెర్వాంటిస్, షేక్‌స్పియర్, గార్సిలాసోడిలావేగాలాంటివిశ్వవిఖ్యాతసాహిత్యవేత్తలజన్మదినంఏప్రిల్23. 

సుదినాన్నియునెస్కోవిద్యావైజ్ఞానికసాంస్కృతికవిభాగంప్రపంచపుస్తకదినంగాసంస్మరించుకొమ్మనికోరడంఅన్నివిధాలాసముచితం.

కేవలంఅక్షరవేత్తలనుసన్మానించుకునేఉత్తమసంప్రదాయంమాత్రమేకాదుకాపీహక్కులరక్షణచట్టాలనూప్రపంచవ్యాప్తంగాపునస్సమీక్షించుకునేసుదినంకూడాసుముహూర్తానే. పుస్తకాభిమానులుఅందరూఆనందించదగ్గసందర్భమిది. ప్రపంచవ్యాప్తంగాఅసంఖ్యాకఅక్షరప్రియులుఎందరోఅందరికీఅభివందనాలు!

“తెలుగు ఏ విధంగా దరిద్రపు భాష అయిందో?!”

తెలుగువిధంగాదరిద్రపుభాషఅయిందో?!”

నన్నయగారిపున్నెమాఅనిమనభాషలోఆంగ్లభాషకన్నా

సుసంపన్నమైనపదజాలం చాలానేపోగుపడింది. సంస్కృతమైతేనేమి

విభక్తి ప్రత్యయాలు చేర్చి, ఒక వ్యాకరణం సృష్టించి, మెరుగులు దిద్ది, భాషా స్వరూప స్వభావాలను స్థిరపరచి.. తెలుగు పలుకుకి నన్నపార్యుడు ఒంటి చేత్తో అందించిన భాషాసేవ ఇవాళ పది అకాడెమీలుడజను విద్యా పీఠాలు మొత్తం కలిసి ఒక పంచవర్ష ప్రణాళిక  సొమ్మంతా మేసినా  ఎంత వరకు నిర్దుష్టంగా సాధిస్తాయో సందేహమే!

ఐనా మనకు మన తెలుగు భాషంటే ఎక్కడ లేని చులకన. ఆంగ్లంతో నిత్యం పో లిక పెట్టి తేలిక చేసుకోవడం అదో..భేషజం. మనది కాని ఆ దొరల భాష మీద అంతులేని మోజుతో ఎంత పడీ పడి ఆసాంతం నెర్చేసుకున్నాఆ జ్ఞానం సర్వస్వం మన తెలుగు వాజ్ఞ్మయం  ముందు-గుమ్మడి పండు ముందు ఆవగింజ.మాతృభాష మీద వెర్రిప్రేమతో అంటున్న యథాలాపం ప్రెలాపనలు కావివి.  చాలా ఉదాహరణలు తీసి చూపించ వచ్చు. ప్రస్తుతానికి ఈ ఒక్కటి చిత్తగించండిః

ఇంగ్లీషుభాషలోకొడుకుఅంటే‘son’అనిఒక్కడే పదం. అదేమనతెలుగులో…?

పన్నెండు రకాలపుత్రులున్నారు.

 1. ఔరసుడు=భార్యయందుతనకుపుట్టినవాడు.
 2. క్షేత్రజ్ఞుడు=పెద్దలఅనుమతితోబావగారితోగాని, మరదితోగానిపొందినసంతానం
 3. దత్తుడు=దత్తతతీసుకున్నవాడు
 4. కృత్రిముడు=అభిమానంతోపెంచుకున్నవాడు
 5. గూఢోత్పన్నుడు=రంకుమొగుడికిపుట్టినవాడు
 6. అపవిద్ధుడు=తండ్రి/తల్లివిడిస్తేతెచ్చిపెంచుకున్నవాడు
 7. కానీనుడు=కన్యాత్వదశలోరహస్యంగాఇతరునికిపుట్టినవాడు
 8. సహొఢజుడు=గర్భిణిగాఉన్నప్పుడు చేసుకున్నభార్యకుపుట్టినవాడు
 9. క్రీతుడు=తల్లిదండ్రులకుడబ్బిచ్చితెచ్చుకున్నబిడ్డ
 10. పునర్బవుడు=మారుమనువుబోయినస్త్రీకిపుట్టినవాడు
 11. జ్ఞాతిరేతుడు=దాయాదికొడుకు
 12. స్వయందత్తుడు=తనంతతానుగాపుత్రుడిగాఉంటాననివచ్చినవాడు

ఇప్పుడుచెప్పండితెలుగువిధంగాదరిద్రపుభాషఅయిందో?!”

తెలుసుకోకుండా తెలివితక్కువగా ఆత్మగౌరవం సంగతి కూడా మరచి మన భాషను గురించి మనమే చేసుకునే దుష్ప్రచారం కాదూ..ఇదంతా?

ఇదీ మన తెలుగు దీన స్థితి-అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా కౌముదికి రాసిన గల్పిక

సెప్టేంబర్ -8- అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా కౌముదికి రాసిన గల్పిక

 

 

 

http://naalokam.com/wp-content/uploads/2011/09/%E0%B0%87%E0%B0%A6%E0%B1%80-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%A6%E0%B1%80%E0%B0%A8-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-2011-%E0%B0%B8%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF.pdf

శేషారత్నం-బహుమతి పొందిన కథ-కౌముది కథల పోటీలో

 

 

 

 

శేషారత్నం -కౌముది పోటిళ్లో బహుమతి పొందిన కథ

http://naalokam.com/wp-content/uploads/2011/10/%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%95%E0%B1%8C%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A51.pdf