నీతి అంతిమంగా నిలుస్తుందా?

ఇప్పుడంటే మొదలైనప్పట్నుంచీ పూర్తై హాలు బైటికి వచ్చేదాకా హోరెత్తించే ‘సౌండు’ కానీ..చలనచిత్రాల మొదటి దశ మూగది. తెరమీద బొమ్మలాడుతుంటే అనువాదకుడు హాలు మూల నిలబడి పెద్ద గొంతేసుకుని తనకు తోచిన వ్యాఖ్యానం చేస్తుండేవాడు. అప్పట్లో వచ్చినవన్నీ ముంబై..కలకత్తా మార్కు హిందీ.. బెంగాలీ ‘మేకు’లు కనక ఈ అనువాదకుడి సాయం మన ప్రేక్షకులకు అవసరమయేది.అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది.సంఘటన పాతదే ఐనా..అందులోని హాస్యం మాత్రం సదా తాజాదే.చిత్తగించండి చిత్తమున్నవారు.
ఒక హిందీ సినిమా మొదటి రోజు మొదటి ఆట మ్యాట్నీ మొదలైంది ఒక తెలుగు వూళ్ళో.బాక్సు చివరి నిముషంలో రావడం వల్ల హాలు వాళ్ళకు వేసుకుని చూసుకునే సావకాశం లేక పోయింది.వచ్చిన రీళ్ళను ఆదరాబాదరాగా ప్రోజెక్టరు రోలర్ల్లకు చుట్టేసి సినిమా మొదలు పెట్టేసారు. కథ నడుస్తోంది.అనువాదకుడు భీభత్సంగా అనువాదం చేసి పారేస్తున్నాడు తనకు తోచిన పదజాలంతో.చివరికి అన్ని చిత్రాలలో లాగేనే కథానాయికను నానాతిప్పలు పెట్టిన ప్రతినాయకుడు ముష్టియుద్దంలో కథానాయకుడి చేత చితకబాదించుకుని..ఎలాగైతేనేం..చచ్చాడు చివరికి. అనువాదకుడు వ్యాఖ్యానంతో రెచ్చి పోతూ స్వస్తి వాక్యాల్లో ఇలాగా నీతి బోధ మొదలుపెట్టాడు”అంతిమ విజం న్యాయానికి, నీతికే లభిస్తుందని మరో సారి రుజువైంది. ఎంత కాలం దుష్టుల ఆటలు చెల్లుతాయి? ఈ చిత్రంలో అదే నీతి” అంటూ. జనం లేచేశారు ఈలలేసుకుంటో సినిమా ఐపోయిందని. కానీ..చచ్చిన ప్రతినాయకుడు..ఎలా బ్రతికి వచ్చాడో..మద్యం తాగుతూ..వికటాట్టహాసాలతో కథానాయికను తెగ చెర బట్టేస్తున్నాడు! తెల్ల బోవడం ప్రెక్షకుల వంతయింది. చితకబాదుదామనుకుంటే అనువాదకుడేడి? ప్రాజెక్టు రూంలోకెళ్ళి నక్కి కుర్చున్నాడు.
(రీళ్లుచుట్టే హడావుడిలో ఎలా జరిగిందో ఏమో కానీ..చివరి భాగం ముందుకి ..ముందు భాగం చివరికి తారుమారయాయి..అదండీ సంగతి! )

2 thoughts on “నీతి అంతిమంగా నిలుస్తుందా?

  1. మీ బ్లాగ్ను బ్లాగ్ వరల్డ్ కి అనుసంధానం చేయడం జరిగింది.బ్లాగ్ వరల్డ్ ను ఫాలో అవుతూ ఉండండి.మరిన్ని ఉపయోగాలు మీకు తెలుస్తాయి.ప్రతి సంవత్సరము బెస్ట్ బ్లాగ్ వరల్డ్ అవార్డ్ కూడా పెట్టి తెలుగు బ్లాగులను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నాము.వివరాలు త్వరలో….వీలును బట్టి మీ బ్లాగ్ను సంబంధిత శీర్షికకు చేరుస్తాము. http://blogworld-ac.blogspot.in/

  2. మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
    క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

Leave a reply to ahmedchowdary Cancel reply